ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేయాలని ప్రయత్నిస్తుంటారు..పిల్లల ఎడ్యుకేషన్, పెళ్లిళ్లు, వ్యాపారం, సొంతింటి కల నెరవేర్చు కునేం దుకు..ఇలా అనేక రకాల కోరికలతో సేవింగ్స్ చేస్తుంటారు..అయితే ఎలా సేవింగ్ చేస్తే అధిక రిటర్న్స్ వస్తాయి..తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఏం చేయాలి అని సందేహాలుంటాయి.
సేవింగ్స్ కోసం ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి మార్గాల ద్వారా పొదుపు చేస్తుంటారు.. అయితే ఎఫ్ డీలు, ఆర్డీలపై బ్యాంకులు రకరకాల వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.. ఫిక్స్ డ్ డిపాజిట్లకోసం అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్న టాప్ 8 బ్యాంకులు, అవి అందిస్తున్న వడ్డీ రేట్లను తెలుసుకుందాం..
Also Read:-పోషకాహారం వడ్డించాల్సిందే.. సర్కార్బడుల్లో మధ్యాహ్న భోజనంపై పిటీషన్
గ్యారంటీ రిటర్స్న్, అధిక రిటర్న్స్ రావాలంటే ఫిక్స్ డ్ డిపాజిట్లు బెటర్.. బ్యాంకులు పోటీపడి ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ లను అందిస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటో చూద్దాం..
మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే..
హెచ్డీఎఫ్సీ..
మూడేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు అత్యధికంగా వడ్డీని చెల్లిస్తుంది.. సాధారణ సిటిజన్లకు 7 శాతం వడ్డీరేటు, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీరేట్లను అందిస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్..
కోటక్ మహీంద్ర బ్యాంక్ కూడా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మాదిరిగానే హై ఇంటరెస్ట్ ను అందిస్తోంది. సాధారణ సిటిజన్లకు 7 శాతం, సినీయర్ సిటిజన్లకు 7.5 శాతం చొప్పున మూడేళ్ల కాలపరిమితితో అధిక వడ్డీని చెల్లిస్తోంది.
ఎస్బీఐ..
కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ లా కాకుండా.. ఎస్ బీఐ వడ్డ రేట్ల సాధారణ సిటిజన్ల విషయంలో కొంచెం తక్కువగా అందిస్తోంది.. అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం మిగతా బ్యాంకుల మాదిరిగానే అధిక వడ్డీ చెల్లిస్తోంది.. సాధారణ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ అందిస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు మాత్రం 7.25 శాతం వడ్డీని అందిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్
ఫిక్స్ డ్ డిపాజిట్ల విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఒక్కఅ డుగు ముందుగానే ఉంది. మూడేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ సిటిజన్లకు 7శాతం వడ్డీ చెల్లిస్తోంది.. అదే సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అధికంగా వడ్డీని అందిస్తోంది.
ఫెడరల్ బ్యాంక్..
ఫెడరల్ బ్యాంకు కూడా ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తోంది.. మూడేళ్ల కాలపరిమితి గల ఎఫ్ డీలపై సాధారణ సిటిజన్లకు 7శాతం, అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.5 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
యూనియన్ బ్యాంక్..
ఎఫ్డీలపై వడ్డీ విషయంలో యూనియన్ బ్యాంక్ కూడా దాదాపు మిగతా బ్యాంకుల మాదిరిగానే వడ్డీరేట్లను అందిస్తోంది.. నవంబర్ 1 నుంచి మూడేళ్ల కాలపరిమితితో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే.. సాధారణ సిటిజన్లకు 6.7 శాతం వడ్డీ, అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.2 శాతం వడ్డీ చెల్లిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అక్టోబర్ 1 నుంచి కొత్త వడ్డీరేట్లను అమలు చేస్తోంది. సాధారణ సిటిజన్లకు 7శాతం ఇంటరెస్ట్.. 7.5 శాతం వడ్డీని సీనియర్ సిటిజన్లకు వడ్డీ చెల్లిస్తోంది.
కెనరా బ్యాంక్..
కెనరా బ్యాంక్ కూడా ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది.. కొత్త వడ్డీరేట్ల ప్రకారం.. సాధారణ సిటిజన్లకు 7.4 శాతం,సీనియర్ సిటిజన్లకు 7.9 శాతం వడ్డీని అందిస్తోంది.