పాపన్నపేట, వెలుగు: పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో శుక్రవారం షూటింగ్ సందడి నెలకొంది. ఆషాడ మాసం సందర్భంగా బోనాల పాటను చిత్రీకరించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగ ప్రాధాన్యం తెలిపేలా ఈ పాటను రూపొందిస్తున్నామని డైరెక్టర్ మదన్తెలిపారు. షూటింగ్ లో బలగం రమేశ్ రేఖ, సింగర్ శ్రీ విద్య, అజయ్ గౌడ్, నీరుడి మల్లేశం, గ్రామస్తులు పాల్గొన్నారు.