ఆల్ ఇండియా ఎల్ఐసీ గేమ్స్ షురూ

హైదరాబాద్​, వెలుగు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) నిర్వహించే అంతర్గత క్రీడల పోటీ ఆల్ ఇండియా ఎల్ఐసీ గేమ్స్ జైపూర్‎లో మంగళవారం మొదలయ్యాయి. ఎల్ఐసీలో పనిచేసే ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొంటారు. దాదాపు 450 మంది వీటిలో పాల్గొంటున్నారు. ఈనెల 29న ఎల్ఐసీ గేమ్స్ ముగుస్తాయి. ఈ నాలుగు రోజుల కార్యక్రమాన్ని సంస్థ సీఈఓ, ఎండీ  సిద్ధార్థ మొహంతి ప్రారంభించారు. క్యారమ్, చెస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్​లో పోటీలు జరుగుతాయి.  క్రీడాకారులను ఉద్దేశించి మొహంతి మాట్లాడుతూ, క్రీడలు మనస్సు, శరీరాన్ని ఉత్తేజితం చేస్తాయని అన్నారు.