ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కారును ఢీ కొట్టిన లారీ

ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. పాయల్ శంకర్ కారును వెనక నుంచి  లారీ ఢీ కొట్టింది.  హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు వెళ్తుండగా కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజీ వాడి చౌరస్తా దగ్గర  ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో  ఎమ్మెల్యే  కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పాయల్ శంకర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో క్షేమంగా బయటపడ్డారు.  ప్రమాదం జరిగిన వెంటనే ఆదిలాబాద్ వెళ్ళిపోయాడు ఎమ్మెల్యే.  ఎలాంటి గాయాలు కాకపోవడంతో అదే కారులో ఇంటికి వెళ్లిపోయాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్.

ALSO READ | పద్మశ్రీ అవార్డు గ్రహీత.. గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజు కన్నుమూత

అయితే తాను క్షేమంగా ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్.స్వల్ప గాయాలు అయ్యాయని..ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు.