జైపూర్, వెలుగు: జైపూర్ పోలీస్ స్టేషన్‌ను రామగుండం కమిషనర్ ఎం.శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
డయల్ 100 కాల్స్‌కు స్పందించాలని బ్లూ క్లోట్స్ సిబ్బందికి సూచించారు. రాత్రి పెట్రోలింగ్ చేపట్టి అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ తప్పనిసరిగా సేకరించాలన్నారు. పెట్రో కార్ వాహనంలో ఫస్టెయిడ్ కిట్, డ్రాగన్ లైట్, రోప్స్, కోన్స్, క్రైమ్ ప్రొటాక్ట్ రిబ్బన్, బాడీ ఫ్రొటెక్టర్లను తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ మోహన్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్ ఉన్నారు.