కాగజ్‌నగర్, వెలుగు : జ్వరంతో ఓ టెన్త్ స్టూడెంట్ చనిపోయింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయి పేట్‌కు చెందిన జాడె కిశోర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె పూజ (15) ఆసిఫాబాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో టెన్త్ చదువుతోంది. పూజకి మూడు రోజుల కింద జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు.
శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ కొనసాగుతుండగా పరిస్థితి విషమంగా మారింది. దీంతో శనివారం హైదరాబాద్ తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.