నిర్మల్/కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: నిర్మల్ పట్టణంలోని జుమ్మే రాత్ పేట్ హైస్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 1974లో టెన్త్, ఇంటర్ చదివిన వారంతా 50 ఏండ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడో నివసిస్తున్నవారంతా ఆదివారం స్థానిక ఆర్కే ఫంక్షన్హాల్లో కలుసుకొని ఒకరినొకరు పలుకరించుకొని భావోద్వేగానికి గురయ్యారు. వారు చదువుకునే సమయంలో ఉన్న ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకొని సంబురంగా గడిపారు. వయసు పైబడినా లెక్కచేయకుండా పోటీల్లో పాల్గొని ఔరా అనిపించారు.
రామకృష్ణాపూర్, బెల్లంపల్లిలో..
రామకృష్ణాపూర్ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ హైస్కూల్లో 2001-–02 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. అంతా ఒకచోట చేరి నాటి స్మృతులను గుర్తుచేసుకొని ఉల్లాసంగా గడిపారు. అప్పటి టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం మల్రాజు రాఘునాథ్ రావు, మంచిర్యాల సంభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ పూదరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లిలోని ప్రగతి జూనియర్ కాలేజీలో 1997–-99 ఇంటర్ (ఎంపీపీ) బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి రోజంతా సందడిగా గడిపారు.