జైనూర్ లో ఉద్రిక్తత.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే ముందస్తు అరెస్ట్..

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో ఉద్రిక్తత నెలకొంది.ఆదివాసీ మహిళపై అత్యాచార ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో పోలీసులు జైనూర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు.  అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. జిల్లా వ్యాప్తంగా రాత్రి 12 గంటల నుండి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. జైనూర్ వైపు రాకపోకలపై నిషేదం విధించారు. 

ఆసిఫాబాద్‌ నుంచి ఉట్నూర్ వైపు కూడా రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. మత విద్వేషాలకు అస్కారం ఉన్నందున ప్రజలు సంయమనం పాటించాలని కోరిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం కోరారు.ర్యాలీలు, సమావేశాలు సభలపై  నిషేదం విధించారు పోలీసులు