ముగిసిన రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలు..

  • జాతీయ పోటీలకు జట్టు ఎంపిక

నిర్మల్ , వెలుగు : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర జూనియర్స్ బాయ్స్, గర్ల్స్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. ఈ పోటీల్లో మొత్తం 22 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేశారు. ఈ జట్టు సభ్యులు చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుంది.

 కాగా ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీఎస్పీ గంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులు నుంచి డీఎస్పీ, చైర్మన్ లు గౌరవ వందనం స్వీకరించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధా కర్ రెడ్డి, సెక్రటరీ గంగాధర్, భేస్ బాల్ రాష్ట్ర అసోసియేషన్ సెక్రెటరీ శ్వేత, ట్రెజరర్ కృష్ణ, ఎస్జిఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్, పేటా సెక్రెటరీ భోజన్న, సాఫ్ట్ బాల్ సెకరేటరీ అన్నపూర్ణ, అబ్జర్వర్లు సునీల్ తదితరులు పాల్గొన్నారు.