ప్రత్యేక తెలంగాణ కోసం  పోరాడిన యోధుడు కాకా

  • కాకా జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడంపై కాంగ్రెస్ నేతల సంబురాలు​ 

కోల్​బెల్ట్, వెలుగు: దేశ రాజకీయాల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందిన కాకా వెంకటస్వామి.. తుది శ్వాస వరకు ఉద్యమాలే ఊపిరిగా పోరాడిన యోధుడు అని కాంగ్రెస్​ లీడర్లు కొనియాడారు. కాకా వెంకటస్వామి జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు సర్కార్​ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మందమర్రిలోని ఎమ్మెల్యే క్యాంపు బి-1 ఆఫీస్​లో కాంగ్రెస్​ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్​ వెంకటస్వామి, వినోద్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. ఎన్నో పదవులు చేపట్టిన కాకా వెంకటస్వామి కార్మికుల కోసం పెన్షన్ పథకం అమలు చేయించారని, నష్టాల బారిన పడిన సింగరేణి సంస్థకు కేంద్రం ద్వారా రూ.400 కోట్లు ఇప్పించి లక్ష మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారని గుర్తుచేశారు. తన 85 ఏండ్ల జీవితకాలలో దాదాపు 65 ఏండ్లు సామాజిక, ప్రజా, రాజకీయ ఉద్యమాలలో క్రియాశీలకంగా పనిచేసి జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చారని కొనియాడారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్​ ప్రెసిడెంట్​ నోముల ఉపేందర్​గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ జనరల్​ సెక్రటరీ సొత్కు సుదర్శన్, ఎస్సీ సెల్, మహిళ పట్టణ అధ్యక్షుడు నెరువట్ల శ్రీనివాస్, గడ్డం రజిని, మండల మాజీ అధ్యక్షుడు కడారి జీవన్ కుమార్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు ఎండీ హఫీజ్, పట్టణ ఉపాధ్యక్షుడు కనకం రాజు, కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.