తెలంగాణ బడ్జెట్ @ రూ.2,91,159 కోట్లు

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ను  శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487కోట్లుగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టగా అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్ల, సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయింపులు చేశామన్నారు.