Telangana Budget : రీజనల్ రింగ్ రోడ్డుకు రూ.1525 కోట్లు

తెలంగాణ రాష్ట్ర లైఫ్ లైన్ గా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటికే అలైన్ మెంట్ తోపాటు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు వచ్చాయి. ఈ క్రమంలోనే రీజనల్ రింగ్ రోడ్డు కోసం.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 2024 బడ్జెట్ లో 15 వందల 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులను భూ సేకరణ, మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించనుంది ప్రభుత్వం.

రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఔటర్ రింగ్ రోడ్డు..  రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేక కారిడార్, స్మార్ట్ సిటీలు, క్లస్టర్లు ఏర్పాటు చేయటానికి ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగానే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లటానికి బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 15 వందల 25 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయిస్తూ.. అందుకు తగ్గట్టుగా నిధులను కేటాయించింది సర్కార్.