పెంబి/కుంటాల, వెలుగు: రూమ్ టూ రీడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో పలు చోట్ల గురువారం మోడల్ లైబ్రరీలను ప్రారంభించారు. పెంబి మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో ఏర్పాటుచేసిన లైబ్రరీని ఎంపీడీవో రమాకాంత్, తహసీల్దార్ లక్ష్మణ్ ప్రారంభించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
ఎంఈవో రాంచందర్, రూమ్ టూ రీడ్ సంస్థ బ్లాక్ కో ఆర్డినేటర్ రాజేందర్, స్కూల్హెచ్ఎం అన్వేషిత, ఎస్ఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు లైబ్రరీని సద్విని యోగం చేసుకొని పఠనా నైపుణ్యం పెంచుకోవాలని కుంటాల ఎంఈవో ముత్యం అన్నారు. రూమ్ టూ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మండలం లోని లింబా కే జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీని ఆయన ప్రారంభించారు. లైబ్రరీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. హెచ్ఎం రవీందర్, స్థానిక నాయకులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.