అంధకారంలో ఆదిలాబాద్.. 33 కేవీ సబ్ స్టేషన్ జంపర్ కట్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 3 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 33 కేవీ సబ్ స్టేషన్ జంపర్ కట్ కావడంతో విద్యత్ సరఫరా స్థంభించింది. దీంతో ఆదిలాబాద్ పట్టణం, పరిసర మండలాల ప్రజలు అంధకారంలో ఇబ్బందులు పడుతున్నారు.

ట్రాన్స్‌కో ఆఫీసర్లు స్పందించడం లేదని ఆదిలాబాద్ వాసులు మండిపడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు బేల, జైనథ్ మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భీంపూర్, తాంసి మండలాలు అంధకారంలో కూరుకుపోయాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది శ్రమిస్తున్నారు.

ALSO READ | 3 అడుగుల నేల కోసం అన్న తలను మొండెం నుంచి వేరు చేశాడు !