లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

ముంబై : ఆటో, బ్యాంకింగ్ షేర్లు లాభపడడంతో బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు శుక్రవారం సానుకూలంగా ముగిశాయి. సెన్సెక్స్‌‌‌‌ 227 పాయింట్లు (0.29 శాతం) పెరిగి 78,699 వద్ద ,  నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 23,813 వద్ద సెటిలయ్యాయి. సెన్సెక్స్‌‌‌‌లో  మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్‌‌‌‌, బజాజ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌, టాటా మోటార్స్‌‌‌‌, బజాజ్ ఫిన్సర్వ్‌‌‌‌,  నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఎస్‌‌‌‌బీఐ, టాటా స్టీల్‌‌‌‌,  అదానీ పోర్ట్స్‌‌‌‌, జొమాటో, అల్ట్రాటెక్ సిమెంట్‌‌‌‌, హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌‌‌‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. 

విదేశీ ఇన్వెస్టర్ల (ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల) అమ్మకాలు ఇంకా తగ్గలేదని, రూపాయి జీవిత కాల కనిష్టాలకు పడడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని ఎనలిస్టులు పేర్కొన్నారు. యూఎస్‌‌‌‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే ముందు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవని అన్నారు. రూపాయి క్షీణించడం,  ఫెడ్ వడ్డీ రేట్లకు తక్కువగా కోత పెడుతుందనే అంచనాలు, ట్రేడ్ డెఫిసిట్ పెరగడం, ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో మార్కెట్‌ పడుతోందన్నారు.

ఈసారీ తగ్గిన ఫారెక్స్ నిల్వలు

ఇండియా ఫారెక్స్ నిల్వలు ఈ నెల 20 తో ముగిసిన వారంలో 8.47 బిలియన్ డాలర్లు తగ్గి  644.391 బిలియన్ డాలర్లకు పడ్డాయి.  అంతకుముందు వారంలో 1.988 బిలియన్ డాలర్లు తగ్గాయి. రూపాయి విలువ మరింతగా పడకుండా చూసేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ జోక్యం చేసుకుంటోంది. దీంతో గత కొన్ని వారాలుగా  ఫారెక్స్ నిల్వలు పడుతున్నాయి. ఈ నెల 20 తో ముగిసిన వారంలో  ఫారిన్ కరెన్సీ అసెట్స్‌‌‌‌ 6.014 బిలియన్ డాలర్లు తగ్గి 556.562 బిలియన్ డాలర్లకు పడ్డాయి.