కాసిపేటలో 61 సార్లు రక్తదానం చేసిన టీచర్

కాసిపేట, వెలుగు: రక్తదానం చేయడంతో పాటు తన విద్యార్థులు, మిత్రులు, బంధువులతో రక్తదానం చేయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ గవర్నమెంట్​టీచర్. కాసిపేట మండలంలోని ట్యాంక్ బస్తీకి చెందిన సి.బాబ్జి మండలంలోని ధర్మారావుపేట జడ్పీ హైస్కూల్​లో ఇంగ్లిష్ ​టీచర్​గా పనిచేస్తున్నారు. 

సోమవారం మంచిర్యాల వలంటరీ బ్లడ్ బ్యాంక్​లో 61వ సారి రక్తదానం చేశారు. అంతకుముందు మూడుసార్లు ప్లేట్​లెట్స్​ డొనేట్ ​చేసి సామాజిక బాధ్యత చాటుకున్నారు. గతంలో కలెక్టర్ నుంచి అవార్డు కూడా అందుకున్నారు.