కోల్బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్లోని తవక్కల్ హైస్కూల్ స్టూడెంట్లు ఇండియాస్ బెస్ట్ డాన్సర్అవార్డులు అందుకున్నట్లు విద్యా సంస్థల అధినేత ఎండీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ఈనెల 18న హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో మయూరి ఆర్ట్స్ఆధ్వర్యంలో పోటీలు జరిగాయన్నారు.
ఇందులో పాఠశాలకు చెందిన ఎల్లంకి రిశికసాయి, రావికంటి సాయి బాంధవ్య, డి.వైష్ణవి, ఐశ్వర్య ప్రతిభ కనబర్చి ఇండియాస్బెస్ట్ డ్యాన్సర్అవార్డులు దక్కించుకున్నట్లు తెలిపారు. గురువారం స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం సన్మానించింది.