ట్రస్మా జిల్లా ప్రెసిడెంట్​గా అబ్దుల్​ అజీజ్

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షుడిగా తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ ఎంఏ అబ్దుల్ అజీజ్ ఎన్నికయ్యారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ​ఫంక్షన్​హాల్​లో జరిగిన రాష్ట్ర ట్రస్మా జనరల్​ బాడీ సమావేశంలో అబ్దుల్​అజీజ్​ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రైవేట్​స్కూళ్ల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా రేగళ్ల ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా శ్యాంసుందర్ రెడ్డి, కోశాధికారిగా రామకృష్ణారెడ్డి, గౌరవ అధ్యక్షుడుగా బత్తిని దేవన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లుగా ప్రమోద్, శ్రీధర్ రెడ్డి, జోబిన్ ఎన్నికయ్యారు.

ప్రెస్, పబ్లిసిటీ ఇన్​ఛార్జీలుగా అంబాల రాజ్ కుమార్, కాజా కమ్రుద్దీన్, ఉమెన్ ఇన్​చార్జీగా రజిని, జాయింట్ సెక్రటరీలు సన్నీ, మణికంఠ, సుఫాయిన్, రవీందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ట్రస్మా స్టేట్​ప్రెసిడెంట్​ఎస్ఎన్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్​టీచర్​ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనంతరెడ్డి, సేమ్స్​ఒలింపియాడ్​ఇన్​చార్జి రాంచంద్రారెడ్డి, ట్రస్మా స్టేట్​వర్కింగ్​ప్రెసిడెంట్​మల్లెత్తుల రాజేంద్రపాణి, వైస్​ప్రెసిడెంట్​మల్లయ్య, వివిధ మండల, పట్టణ బాధ్యులు
 పాల్గొన్నారు.