ఎం అండ్ ఎం, టాటా మోటార్స్‌‌‌‌కు రూ.246 కోట్ల పీఎల్ఐ రాయితీలు

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), టాటా మోటార్స్‌‌‌‌  పీఎల్‌‌‌‌ఐ స్కీమ్‌‌‌‌ కింద చేసిన రూ.246 కోట్ల క్లెయిమ్స్‌‌‌‌కు  ప్రభుత్వం ఆమోదం తెలిపింది.   పీఎల్‌‌‌‌ఐ కింద  ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్ల తయారీ కంపెనీలకు రూ.25,938 కోట్ల విలువైన రాయితీలను ఇస్తున్న విషయం తెలిసిందే.  ఈ స్కీమ్ కింద  బండ్ల తయారీ కంపెనీలు ప్రొడక్షన్ పెంచాయని, టార్గెట్స్ చేరుకుంటున్నాయని హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ హెచ్‌‌‌‌డీ కుమారస్వామి పేర్కొన్నారు. 

  ఎం అండ్ ఎం, టాటా మోటార్స్‌‌‌‌ను ఆయన అభినందించారు.  పీఎల్‌‌‌‌ఐ  కింద అర్హత పొందిన మిగిలిన కంపెనీలు కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జరిపిన సేల్స్ ఆధారంగా  రూ.142.13 కోట్ల రాయితీల కోసం  టాటా మోటార్స్ అప్లికేషన్ పెట్టుకుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. అడ్వాన్స్డ్‌‌‌‌ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటీ) ప్రొడక్ట్‌‌‌‌ల కేటగిరీలో టాటా మోటార్స్ నుంచి    టాటా టియాగో (ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌‌‌‌‌‌‌‌),  స్టార్‌‌‌‌‌‌‌‌బస్‌‌‌‌ ఈవీ (ఎలక్ట్రిక్ బస్‌‌‌‌), ఏస్ ఈవీ (ఎలక్ట్రిక్ కార్గో) సేల్స్ అర్హత పొందాయి.

 2023–24 లో రూ.1,380.24 కోట్ల విలువైన ఈ బండ్ల అమ్మకాలు జరిగాయి. ఏఏటీ కేటగిరీలో ఎం అండ్ ఎం నుంచి ట్రియో, ట్రియో జోర్‌‌‌‌‌‌‌‌, జోర్ గ్రాండ్‌‌‌‌ వంటి  ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మోడల్స్ అమ్మకాలు అర్హత సాధించాయి. ఎం అండ్ ఎం 2023–24 లో రూ.836.02 కోట్ల విలువైన ఈ బండ్లను అమ్మింది. ఈ కంపెనీ  రూ.1‌‌‌‌‌‌‌‌04.08 కోట్ల రాయితీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది.