సేవింగ్స్ ​బ్యాంక్​ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్​ చేయొచ్చు.. 9.1 శాతం వరకు వడ్డీ ఇస్తాం: టాటా కీలక ప్రకటన

న్యూఢిల్లీ: తమ సూపర్​యాప్​ టాటా న్యూ ద్వారా ఇక నుంచి ఫిక్స్​డ్​ డిపాజిట్లు కూడా కొనొచ్చని టాటా డిజిటల్ ​మంగళవారం ప్రకటించింది. సేవింగ్స్​ బ్యాంక్​ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్​ చేయవచ్చని, 9.1 శాతం వరకు వడ్డీ ఇస్తామని తెలిపింది. వ్యాపారులు, సాధారణ ప్రజలు తమ సంపదను పెంచుకోవడానికి తమ మార్కెట్​ప్లేస్​ ఎంతగానో ఉపయోగపడుతుందని టాటా డిజిటల్​ చీఫ్ ​బిజినెస్​ ఆఫీసర్​ గౌరవ్​ చెప్పారు.

టాటా న్యూలో కనీసం రూ.వెయ్యి నుంచి ఎఫ్​డీ చేయవచ్చు. డిపాజిట్ ఇన్సూరెన్స్​ అండ్​ క్రెడిట్ ​గ్యారంటీ కార్పొరేషన్​ ద్వారా రూ.ఐదు లక్షల పెట్టుబడి వరకు బీమా ఉంటుంది. సూర్యోదయ్​స్మాల్​ఫైనాన్స్​బ్యాంక్​, శ్రీరామ్​ఫైనాన్స్​, బజాజ్​ఫైనాన్స్​ వంటి బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల్లో టాటా న్యూ ద్వారా ఇన్వెస్ట్​ చేయవచ్చు.