- నగదు, 7 బైక్ల స్వాధీనం
బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాలలోని ఓ మామిడి తోటలో గురువారం సాయంత్రం పేకాట ఆడుతున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకు న్నారు. ఎస్ఐ రమేశ్ కథనం ప్రకారం.. పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న ఆధ్వర్యంలో ఈ దాడి చేసినట్లు చెప్పారు. పట్టుబడిన వారిలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన తొంగల వెంకటేశ్, చింతల రాజేందర్
ఉపేందర్, మాచర్ల గట్టయ్య, నాగనవేని నరేశ్, ఎస్డీ ఉస్మాన్, శ్రీనివాస్, తాండూర్ మండలానికి చెందిన ఎండీ హాకీం ఉన్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ.19 వేల నగదు, 8 సెల్ఫోన్లతోపాటు 7 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ నిమిత్తం వాళ్ల గురజాల పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.