లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణంలో విలేకరుల పేరుతో బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం డీజేఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్ఐ తానాజీకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీజేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విలేకరుల పేరుతో ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరులు కాని వారు కూడా తమ వాహనాలపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకుంటున్నారని, వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. డీజేఎఫ్ నాయకులు కుశనపల్లి సతీశ్, మధు చారి, బైరం లింగన్న, మేడి భాను, కట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.