చెన్నైలో ఎంస్​ఐ ప్లాంట్​ ప్రారంభం

న్యూఢిల్లీ: తైవానీస్ ల్యాప్‌‌టాప్ తయారీ సంస్థ ఎంఎస్​ఐ చెన్నైలో తన మొదటి ప్లాంటును మంగళవారం ప్రారంభించింది. దీని ద్వారా భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా, ఎంఎస్​ఐ రెండు ల్యాప్‌‌టాప్ మోడల్స్​‘ ఎంఎస్​ఐ మోడరన్ 14,  ఎంఎస్​ఐ థిన్ 15’లను ఇక్కడ తయారు చేస్తామని ప్రకటించింది.  

అధిక- పనితీరు గల ల్యాప్‌‌టాప్‌‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా స్థానికంగా తయారయిన పరికరాలను అందించడానికి కట్టుబడి ఉన్నామని ఎంఎస్​ఐ ప్రకటన పేర్కొంది.   భారతదేశంలో తయారైన థిన్  మోడరన్ సిరీస్ ల్యాప్‌‌టాప్‌‌ల ధరలు వరుసగా రూ. 73,990,  రూ. 52,990 నుంచి మొదలవుతాయి.