- పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి సేవలు షురూ
- ప్రతి ఇంటికి రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్
- రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఆన్ లైన్ సేవలు ఈజీ
పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీ ఫైబర్సేవలను పల్లెల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల సర్కార్ప్రాక్టికల్రిపోర్టు ఆధారంగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆయా జిల్లాల్లో మూడు గ్రామాలను సెలక్ట్ చేసి టీ ఫైబర్‌ను ఆవిష్కరిం చింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌లో టీ ఫైబర్సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
నెలకు రూ. 300కే ఇంటర్నెట్సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. దీంతో ప్రతి ఇంటితో పాటు ఆఫీసుల్లో ఆన్లైన్సేవలు ఇక సులభం అవుతాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 1100 కిలో మీటర్ల మేర ఇంటర్నెట్కేబుల్వేశారు. విద్యా, వైద్య రంగాలతో పాటు అన్ని సర్వీసు విభాగాలకు ఎంతో ఉపయోగంగా ఉండనుంది. పోలీసుశాఖకు కూడా మెరుగైన సేవలు అందుతాయి.
ఈజీ కానున్న ఇంటర్నెట్ సేవలు
ఇకముందు టీ ఫైబర్‌తో ఇంటర్నెట్ ఈజీ కానుండగా.. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పలు గ్రామాలకు కేబుల్ కనెక్షన్ ఇచ్చారు. ప్రయోగాత్మకంగా కొన్ని ఆఫీసులకు ఇంటర్నెట్ కనెక్షన్ఇవ్వగా సరిగా పనిచేయక పోవడంతో లోపాలను సరిదిద్దే పనుల్లో అధికారులు ఉన్నారు.
పైలట్‌ప్రాజెక్టు గ్రామంలో నెల రోజుల పాటు పూర్తిస్థాయి కనెక్షన్లు ఇచ్చి పర్యవేక్షిస్తారు. కొద్ది రోజుల్లోనే జిల్లావ్యాప్తంగా అన్ని ఆఫీసులతో పాటు ఇంటింటికి కనెక్షన్ఇవ్వనున్నారు. ప్రజలు బిల్లును ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. కంప్యూటర్లు, టీవీలకు 4జీ, 5జీ నెట్ అందుబాటులోకి వస్తుంది. 20 ఎంబీపీఎస్ స్పీడ్ తో ప్రభుత్వ ఆఫీసులకు, స్కూల్స్‌కు కనెక్షన్ఇవ్వనున్నారు.
ప్రస్తుతం రూ. 1, 000కి పైగా ఇంటర్నెట్డాటా ఉపయోగిస్తున్నారు. అదే టీ ఫైబర్ తో నెలకు రూ. 300తోనే అన్ని సేవలు పొందే చాన్స్ఉంటుంది. ప్రస్తుతం కలెక్టరేట్, ఎంపీడీవో, పంచాయతీ ఆఫీసుల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. కానీ, తగిన స్పీడ్ లేకపోవడంతో ఆన్‌లైన్‌సేవలకు అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడుతుంది . టీ ఫైబర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అన్నిసేవలు నిరంతరం అందుబాటులోకి వచ్చి ఈజీ అవుతాయి.
విద్యా, వైద్య రంగాలకు...
గత సర్కార్స్కూళ్లలో కంప్యూటర్లు ఏర్పాటు చేసినా వాటికి ఇంటర్నెట్కనెక్షన్ లేక మూలకు పడేశారు. కొద్ది రోజులు ఆయా స్కూల్స్ హెచ్ఎంలు సొంత ఖర్చులతో ఇంటర్నెట్డాటా కొనుగోలు చేసి కంప్యూటర్లు నడిపించారు. ప్రతి నెల దాదాపు రూ. 1000 నుంచి రూ. 2000కుపైగా అవుతుండడడంతో కంప్యూటర్లను వినియోగించడం లేదని తెలుస్తుంది.
టీ ఫైబర్అందుబాటులోకి వస్తే టీవీల్లో టెలీకాస్ట్అయ్యే టీ సాట్ క్లాసులు, దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయ్యే డిజిటల్క్లాసులను విద్యార్థులు చూడొచ్చు. ప్రతి స్కూల్, కాలేజీకి కనెక్షన్ఇవ్వడం ద్వారా విద్యార్థులకు డిజిటల్క్లాసులు అందుబాటులోకి వస్తాయి. అలాగే వైద్యరంగంలో కూడా త్వరగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసే చాన్స్ఉంటుంది. అలాగే గ్రామాల్లోని పీహెచ్‌ల ద్వారా వెళ్తున్న రోగనిర్ధారణ శాంపిల్స్ వివరాలు తొందరగా తెలుసుకోవచ్చు.
ప్రతి పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. నేర నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టి, కమాండ్కంట్రోల్కు అనుసంధానించి పర్యవేక్షణ చేస్తారు. నేరాల నియంత్రణకు పోలీసు శాఖకు ఎంతో ఉపయోగంగానూ ఉంటుంది.