ప్రొవైడర్ సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త బ్రాండ్ ట్రూజన్ సోలార్ విస్తరణకు రెడీ అయింది. వచ్చే మార్చి నాటికి మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ఎండీ భవానీ సురేశ్ వెల్లడించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తన డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోందని ప్రకటించారు. భారతదేశంలోని టాప్ 5 సోలార్ ఈపీసీ కంపెనీలలో ఒకటిగా మారాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ముఫ్త్ బిజిలీ యోజన వంటి ప్రభుత్వ కార్యక్రమాల వల్ల సోలార్రూఫ్టాప్లకు మరింత ఆదరణ పెరుగుతోందని సురేశ్ చెప్పారు.