దండేపల్లి, వెలుగు : విధుల్లో నిర్లక్ష్యం వహించిన బీట్ఆఫీసర్లపై వేటు పడింది. ఇద్దరిని సస్పెండ్చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పనిచేస్తున్న బీట్ ఆఫీసర్ అనిల్, చింతపల్లి బీట్ ఆఫీసర్ సాగర్ కలప అక్రమ రవాణాను అరికట్టలేకపోయారని, వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ సుష్మా రావు తెలిపారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డీఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.