AI తో ఈ ఉద్యోగాలకు ముప్పు..మరో ఐదేళ్లలో ఈ జాబ్స్ ఉండవు

  • ఐదేండ్లలో క్లర్క్‌‌‌‌ జాబ్స్​ మాయం!
  • ఏఐతో గ్రాఫిక్ డిజైనర్లు, అకౌంటెంట్లు, ఆడిటర్లకు గండం
  • వ్యవసాయ కూలీలు, డెలివరీ డ్రైవర్లు, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ డెవలపర్లకు 
  •  పెరగనున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌
  • వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌‌‌‌‌‌‌‌ వెల్లడి

న్యూఢిల్లీ: క్యాషియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టికెట్ క్లర్క్‌‌‌‌‌‌‌‌, డేటా ఎంట్రీ క్లర్క్‌‌‌‌‌‌‌‌ వంటి  ఉద్యోగాలు  మరో ఐదేళ్లలో ఉండకపోవచ్చని  సర్వే ఒకటి పేర్కొంది. మరోవైపు వ్యవసాయ పనులు పెరుగుతాయని,  డ్రైవర్ల అవసరం ఎక్కువ అవుతుందని వెల్లడించింది. 

వచ్చే ఐదేళ్లలో సుమారు 17 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని,  9.2 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూఈఎఫ్‌‌‌‌‌‌‌‌) తన  తాజా రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో వివరించింది.  నికరంగా 7.8 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. 

ఈ రిపోర్ట్ ప్రకారం,  జాబ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో భారీ మార్పులు రావడానికి కారణం టెక్నాలజీ అడ్వాన్స్ కావడమే. దీనికి తోడు  గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా నెలకొన్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వివిధ ప్రాంతాల్లో మారుతున్న అలవాట్లు వంటివి జాబ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పెద్ద మార్పులు తీసుకొస్తున్నాయి. 

జాబ్స్‌‌‌‌‌‌‌‌కు అవసరమయ్యే స్కిల్స్ ఎప్పటికప్పుడు మారుతుండడంతో   ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. ఏఐ, బిగ్‌‌‌‌‌‌‌‌డేటా, సైబర్ సెక్యూరిటీస్ వంటి  టెక్నాలజీ స్కిల్స్ ఉన్నవారికి ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. కానీ,  క్రియేటివ్ థింకింగ్‌‌‌‌‌‌‌‌, ఫ్లెక్సిబిలిటీ వంటి హ్యూమన్ స్కిల్స్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. 

ఈ జాబ్‌‌‌‌‌‌‌‌లకు ఫుల్ డిమాండ్‌‌‌‌‌‌‌‌..

 ఎడ్యుకేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. యూనివర్సిటీ, హయ్యర్ ఎడ్యుకేషన్ టీచర్లు, సెకండరీ  స్కూల్ టీచర్లు, కౌన్సెలింగ్ ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలు భారీగా పెరగనున్నాయి. 

అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఎగ్జామినర్లు, ఇన్వెస్టిగేటర్లకు డిమాండ్ పడిపోనుంది.  ఇంకో ఐదేళ్లలో  వ్యవసాయం పనులు చేసేవారు, డెలివరీ డ్రైవర్లు,  కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ వర్కర్లు, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్, యాప్ డెవలపర్లు, సేల్స్ పర్సన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం భారీగా ఉంటుందని, ఈ జాబ్స్ ఎక్కువగా పెరుగుతాయని డబ్ల్యూఈఎఫ్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ వివరించింది. 

అలానే నర్సింగ్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌,  ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో పనిచేసేవారు, కారు, వ్యాన్‌‌‌‌‌‌‌‌, మోటార్ సైకిల్ డ్రైవర్లు, ఫుడ్‌‌‌‌‌‌‌‌, డ్రింకులను సర్వ్‌‌‌‌‌‌‌‌ చేసేవాళ్లు, జనరల్‌‌‌‌‌‌‌‌, ఆపరేషనల్ మేనేజర్లు,  ప్రాజెక్ట్ మేనేజర్లు   వంటి ఉద్యోగాలు కూడా భారీగా పెరగనున్నాయి.  

మరోవైపు క్యాషియర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, టికెట్ క్లర్క్‌‌‌‌‌‌‌‌, ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ, బిల్డింగ్ క్లీనర్లు, హౌస్‌‌‌‌‌‌‌‌ కీపర్లు, మెటీరియల్స్, స్టాక్  రికార్డ్‌‌‌‌‌‌‌‌లను చూసుకునే  క్లర్క్‌‌‌‌‌‌‌‌లు, ప్రింటింగ్‌‌‌‌‌‌‌‌, సంబంధిత జాబ్‌‌‌‌‌‌‌‌ల డిమాండ్ మాత్రం వేగంగా పడిపోనుంది. 

అకౌంటింగ్‌‌‌‌‌‌‌‌, బుక్‌‌‌‌‌‌‌‌కీపింగ్‌‌‌‌‌‌‌‌, పేరోల్ క్లర్క్స్‌‌‌‌‌‌‌‌, అకౌంటెంట్స్‌‌‌‌‌‌‌‌, ఆడిటర్స్‌‌‌‌‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టేషన్ అటెండెంట్లు, బ్యాంక్ క్లర్క్‌‌‌‌‌‌‌‌లు, డేటా ఎంట్రీ క్లర్క్‌‌లు, కస్టమర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌ వర్కర్లు, సెక్యూరిటీ గార్డ్స్‌‌‌‌‌‌‌‌, కండక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్లు  వంటి జాబ్స్ భారీగా పడిపోనున్నాయని డబ్ల్యూఈఎఫ్ అంచనా వేస్తోంది.

ఏఐకి మొగ్గు..

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)  విస్తరిస్తోంది. బిగ్‌‌‌‌ డేటా, రోబోటిక్స్‌‌‌‌, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీల్లో స్పెషలిస్ట్‌‌‌‌లకు భారీగా డిమాండ్ ఉంది.  

చాలా కంపెనీలు  ఈ టెక్నాలజీలను వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఆటోమేషన్‌‌‌‌ కారణంగా తమ ఉద్యోగులను తగ్గించుకుంటామని  41శాతం  కంపెనీలు  ప్రకటించాయి. ఉద్యోగుల స్కిల్స్‌‌‌‌ను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని 77 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.