కోల్‌బెల్ట్, వెలుగు: కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు సింగరేణి ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్యాదగిరి సత్తయ్య సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మందమర్రిలోని బీఎంఎస్ ఆఫీస్‌లో నిర్వహించిన యూనియన్జనరల్ బాడీ సమావేశానికి ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్‌ను రాష్ట్ర సర్కార్ చెల్లించాలని, వారి సొంతింటి కల నేరవేర్చాలని కోరారు. కార్మికుల పిల్లలకు మెరుగైన విద్య కోసంసింగరేణి వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, సీబీఎస్ఈ సిలబస్బోధనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 14న శ్రీరాంపూర్‌లో జరిగే యూనియన్28వ ద్వై వార్షిక మహాసభలకు కార్మికులు భారీగా హాజరై సక్సెస్ చేయాలని కోరారు. సందర్భంగా పలువురు కార్మికులు బీఎంఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
యూనియన్ నూతన కమిటీ నియామకం
మందమర్రి ఏరియా బీఎంఎస్ నూతన కమిటీని నియమించినట్లు యాదగిరి సత్తయ్య తెలిపారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్‌గా డొనికేన రమేశ్, ఏరియా సెక్రటరీగా గుర్రం ప్రదీప్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డి.నరేశ్, పి.శ్రీనివాస్, అఖిలేశ్, బల్ల సురేశ్, జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్ను నియమించారు. జనరల్ బాడీ సమావేశంలో బీఎంఎస్ జిల్లా సెక్రటరీ మద్దూరి రాజుయాదవ్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ కేంద్ర ట్రెజరర్ వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు సారంగపాణి, కేంద్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.