కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తోనే రైతు రాజ్యం : సుంకెట అన్వేష్​ రెడ్డి

  • జిల్లాల్లో కొనసాగుతున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు

నిర్మల్/ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: కాంగ్రెస్ పాలనలోనే రైతు రాజ్యం సాధ్యమవుతుందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్​ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్స వాల్లో భాగంగా నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ రైతు వేదికలో మంగళవారం రైతు పండుగ కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం అన్వేష్​ రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో రైతులకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ చేయని మేలు, పది నెలల్లోనే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చేసి చూపిందన్నారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని తెలిపారు. రైతులు పండించిన సన్న రకం బియ్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీంరెడ్డి, అబ్దుల్ హాది, రామేశ్వర్ రెడ్డి, సోనియా సంతోష్, మామడ ఎంపీపీ జైసింగ్, ఆయా మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

చెక్కుల అందజేత

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆదిలాబాద్​మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి స్టాల్స్​ను పరిశీలించారు. పారిశుధ్య కార్మికులకు భద్రత పరికరాలు పంపిణీ చేశారు. 35 స్వయం సహాయక సంఘాలకు చెక్కులు అందజేశారు. మున్సిపల్​ఇన్​చార్జి కమిషనర్​ తిరుపతి, డీఎల్​సీవో కార్యదర్శి సౌజన్య, డీడబ్ల్యూవో సబిత, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.