ముగిసిన వేసవి క్రికెట్ శిక్షణా శిబిరం

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఎస్​అకాడమిలో హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్ ​ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా మంగళవారం ముగింపు సభ నిర్వహించారు. కార్యక్రమానికి సంగారెడ్డి క్రైమ్ డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి, యువజన నాయకుడు కూన వేణు  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

వారి చేతుల మీదుగా క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శ రాజేందర్ రెడ్డి,  శ్రీనాథ్ రెడ్డి,  మహేందర్​రెడ్డి,  కోచ్ లు చంద్రమౌళి, ఇనాం, రియాజ్, మధుమోహన్, రఘుపతి, తౌహీద్, జితేందర్ రెడ్డి,  దారాసింగ్, విజయ్ పాల్గొన్నారు.

మెదక్​టౌన్ : హైదరాబాద్ క్రికెట్అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో గత నెల నుంచి నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా క్యాంప్ నిర్వాహకులు మాట్లాడుతూ.. క్రికెట్​లో మెలకువలు నేర్చుకున్న క్రీడాకారులు భవిష్యత్​లో మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమనికి ముఖ్య అతిథిగా పెంటాగౌడ్, హెచ్​సీఏ  ప్రతినిధి మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ ఫౌండేషన్ సభ్యులు నర్సింహారెడ్డి, జుబేర్​,  సలీం, ఉమర్, అర్జున్, అబ్దుల్లా, నాగిరెడ్డి, అరవింద్, వినోద్, సాయి పాల్గొన్నారు.