కొత్త ప్రాజెక్టుతో రూ.2,500 కోట్ల ఆదాయం

  • సుమధుర గ్రూప్​ టార్గెట్​

హైదరాబాద్​, వెలుగు:  రియల్ ఎస్టేట్ కంపెనీ సుమధుర గ్రూప్ హైదరాబాద్‌‌‌‌లో అభివృద్ధి చేస్తున్న తన లగ్జరీ ప్రాజెక్ట్ పలైస్ రాయల్‌‌‌‌ ద్వారా  రూ.2,500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నగరంలో ఇది అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్ అభివృద్ధి అని తెలిపింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్  సమీపంలో నిర్మిస్తున్న పలైస్ రాయల్ 2.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో 7.35 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది.  ఇక్కడ 52- అంతస్తుల ఎత్తయిన టవర్‌‌‌‌ను నిర్మిస్తామని,  4, 5 పడకల నివాసాలతో కూడిన 523 యూనిట్లు ఉంటాయని సుమధుర తెలిపింది. 2029 డిసెంబరులో ఇండ్లను అప్పగిస్తారు.  పలైస్ రాయల్‌‌‌‌లో 85వేల చదరపు అడుగుల ఫ్లోటింగ్ గ్రాండ్ క్లబ్‌‌‌‌హౌస్, 85శాతానికి పైగా ల్యాండ్‌‌‌‌స్కేప్ ఏరియా,  విశ్రాంతి సౌకర్యాలు, వెల్‌‌‌‌నెస్ జోన్‌‌‌‌లు ఉంటాయని సుమధుర పేర్కొంది.