మాల ఉద్యోగుల జేఏసీ కన్వీనర్​గా సుధాకర్

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మాల, మాల ఉద్యోగుల జేఏసీ జిల్లా కమిటీని నియమించారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో నూతన కమిటీని ఎంపిక చేసి, గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాల సంఘం సమావేశంలో ప్రకటించారు. డిసెంబర్​1న హైదరాబాద్​పరేడ్ గ్రౌండ్స్​లో నిర్వహించనున్న సింహాగర్జన సభను సక్సెస్ చేయడానికి మాల సంఘం జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. ప్రతి ఇంటి నుంచి మాలలను సభకు తరలించేందుకు సమష్టి కృషి చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు.  

జిల్లా జేఏసీ కన్వీనర్ గా తొగరు సుధాకర్​ను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో కన్వీనర్లుగా జూపాక సుధీర్, దాసరి వెంకటరమణ, గజెల్లి లక్ష్మణ్, కుంభాల రాజేశ్, ఆసాది పురుషోత్తం, పొట్ట మధుకర్, ముత్తమల్ల పుల్లయ్య, డాక్టర్ లేగల శ్రీనివాస్, గరిసె రామస్వామి,  భూపెల్లి మల్లేశ్, కాసర్ల యాదగిరి, ఎర్రోళ్ల నరేశ్, కూన రవికుమార్, కాందారి కిరణ్, బొజ్జ శరత్, గజెల్లి రాజమల్లు, పలిగిరి కనకరాజు, దేవరపల్లి మధు, మండల రవి కుమార్, గోశిక మనోజ్ ను ఎంపిక చేశారు.