నకిలీ పత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ... సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్

తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. మనోహరాబాద్ మండలం కుచారంలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని నకిలీ పత్రాలతో రూ.  80 లక్షలకు అరుణ్ కుమార్ తో పాటుగా  మరో ఎనిమిది మంది విక్రయించారు . నకిలీ పత్రాలతో తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణ  రిజిస్ట్రేషన్ చేశారు.  బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు  సబ్ రిజిస్ట్రార్  తో సహా ఐదుగురిని అరెస్ట్  చేశారు.