ఆదిలాబాద్ లోని టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. తమను ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్ కు చెందిన స్టూడెంట్స్ ఉదయం నాలుగింటి నుంచి.. పీఎస్ ఎదుట బైఠాయించారు.
వారం కిందట జరిగిన విద్యార్థిసంఘాల ఆందోళనలో...జ్యోతిబాపూలే హాస్టల్ సమస్యలను తెలిపినందుకే ప్రిన్సిపల్ తమను టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. ప్రిన్సిపల్ సంగీతపై పీఎస్ లో కంప్లైట్ చేశారు విద్యార్థులు.