బెల్లంపల్లి విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

బెల్లంపల్లి రూరల్, వెలుగు: కన్నెపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ హాస్టల్​ను బుధవారం రాత్రి బెల్లంపల్లి జూనియర్ ​సివిల్ ​జడ్జి మండల లీగల్​ సర్వీస్​ చైర్మన్ ​జె.ముఖేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ప్రతిపూటా స్టూడెంట్లకు సరిపడా భోజనం అందించాలన్నారు.

చట్టాలపై అవగాహన కల్పించారు. ఇదే క్రమంలో స్కూల్​లోకి పాము రావడంతో స్టూడెంట్లు​ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, న్యాయవాదులు పామును చంపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రహరీ లేకపోవడంతో పాములు వస్తున్నాయని టీచర్లు తెలిపారు. దీంతో జడ్జి.. ఎంఈఓకు ఫోన్​ చేసి ప్రహరీ నిర్మాణంపై అడిగి తెలుసుకున్నారు. కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలన్నారు. సీనియర్ ​న్యాయవాదులు గోపీ కిషన్​ సింగ్, రవికుమార్, శివ తదితరులున్నారు.