విద్యార్థులు చలిలో చన్నీటి స్నానాలు

 వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు వణికిపోతున్నారు. వేకువజామున నిద్ర లేవాలంటేనే జంకుతున్నారు. అలాంటిది ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఉండే విద్యార్థులు ఉదయాన్నే లేచి చల్లటి నీటితో స్నానం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో వేడి నీటి కోసం వాటర్ హీటర్లు ఉన్నా అవి పనిచేయకపోవడంతో చలిలోనూ చన్నీళ్లతోనే స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు దృష్టిపెట్టి వేడి నీళ్ల కోసం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు విద్యార్థులు.