కేజీబీవీ హాస్టల్ లో స్టూడెంట్సే పాఠాలు చెబుతుండ్రు

కాగజ్ నగర్ వెలుగు : సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో కేజీబీవీల్లో చదువులు మూలకు పడ్డాయి. టీచింగ్ స్టాఫ్ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కౌటాల కేజీబీవీ హాస్టల్ లోని 10, 9వ తరగతి స్టూడెంట్స్ కొందరు ఇలా టీచర్లుగా మారి.. కింది తరగతులకు పాఠాలు బోధిస్తున్నారు. 

వారు సొంతంగా స్లిప్ టెస్టులు పెట్టుకోవడం, రివిజన్ చేసుకుంటూ చదువులు అరకొరగా సాగిస్తున్నారు. గత 24 రోజుల నుంచి బోధించే వారు ఎవరూ లేక తామే చదువుకుంటున్నామని చెప్తున్నారు.