బాసర ట్రిపుల్‌‌ ఐటీలో స్టూడెంట్స్‌‌ ఆందోళన

బాసర, వెలుగు: బాసర ట్రిపుల్‌‌ ఐటీ స్టూడెంట్స్‌‌ గురువారం మరోసారి ఆందోళనకు దిగారు. క్యాంపస్‌‌లో సౌకర్యాలు కల్పించాలని, రెగ్యులర్‌‌ వీసీని నియమించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ర్యాలీ తీసిన అనంతరం అడ్మినిస్ట్రేటివ్‌‌ బ్లాక్‌‌ ఎదుట బైఠాయించారు. కాగా స్టూడెంట్స్‌‌ తీరు పట్ల ఆర్జీయూకేటీ అడ్మినిస్ట్రేటివ్‌‌ ఆఫీసర్‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు స్టూడెంట్లు రూల్స్‌‌కు విరుద్ధంగా ఆందోళన చేస్తున్నారని, క్యాంపస్‌‌లోని విషయాలను సోషల్‌‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.