స్టూడెంట్ ట్రైబ్తో మారుత్​డ్రోన్ భాగస్వామ్యం

హైదరాబాద్, వెలుగు: చిన్న నగరాల విద్యార్థుల కెరీర్​ డెవెలప్​మెంట్​ కోసం పనిచేసే డిజిటల్ ​కమ్యూనిటీ ప్లాట్​ఫామ్​ ‘స్టూడెంట్  ట్రైబ్’​తో డ్రోన్ ​సంస్థ  వ్యూహాత్మక  భాగస్వామ్యాన్ని ప్రకటించింది. విద్యార్థులకు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కీలక విషయాలు నేర్పించడం దీని లక్ష్యం. ప్రతి నెలలో జరిగే ఈవెంట్స్ , ఆన్​లైన్ వేదికలు,  క్యాంపస్ అంబాసిడర్ల నెట్​వర్క్ ద్వారా  విద్యార్థులు సంప్రదాయ పాఠాల కంటే ఎక్కువగా నేర్చుకుంటారని మారుత్ ​డ్రోన్స్​ తెలిపింది. అంతేగాక ఐదు రోజుల డ్రోన్ పైలెట్ ట్రైనింగ్​ వర్క్ షాప్​ను నిర్వహించి డ్రోన్లకు డీజీసీఏ నియమాలు, ఫ్లైట్ సిమ్యులేటర్ శిక్షణ, సోలో ఫీల్డ్ ఫ్లయింగ్​ పరీక్షల గురించి అవగాహన కల్పిస్తామని మారుత్​ పేర్కొంది.