చదువుకోవడం ఇష్టం లేక స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్య

  • జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం వేంపేట్‌‌‌‌‌‌‌‌లో ఘటన

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : చదువుకోవడం, హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉండడం ఇష్టం లేక డిగ్రీ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం వేంపేట్‌‌‌‌‌‌‌‌లో సోమ వారం జరిగింది. ఎస్సై కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. వేంపేట్ గ్రామానికి చెందిన మారు నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, లావణ్య దంపతులకు కుమారుడు సిద్దార్థ (19), కూతురు ఉన్నారు.

సిద్దార్థ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హిందీ మహావిద్యాలయంలో డిగ్రీ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ చదువుతూ అక్కడే హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు. 15 రోజుల కింద గ్రామానికి వచ్చిన సిద్దార్థ తిరిగి కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. కాలేజీకి వెళ్లాలని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడు.. అప్పుడు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కుటుంబ సభ్యులు సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చే సరికి సిద్ధార్థ ఇంట్లో ఉరి వేసుకొని కనిపించాడు. చదువుపై ఆసక్తి లేకపోవడం, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉండడం ఇష్టం లేకనే సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.