కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

జోగిపేట, వెలుగు: కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జోగిపేట డివిజన్​ టాస్క్​ఫోర్స్​అధికారులు విత్తన షాపుల యజమానులను హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని పలు విత్తన షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. సీడ్​ ప్యాకెట్లపై ఉన్న డేట్,  స్టాక్​ రిజిస్టర్లను పరిశీలించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా రశీదు ఇవ్వాలని సూచించారు. తనిఖీల్లో ఆర్డీవో పాండు, వ్యవసాశాఖ ఏడీ అరుణ, తహసీల్దార్​ భాస్కర్, ఎస్ఐ అరుణ్​కుమార్​ పాల్గొన్నారు.