రామగుండంలో వీధికుక్కల దాడి..బాలుడికి తీవ్రగాయాలు

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండంలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. రామగుండంలోని మజీద్ కార్నర్ సమీపంలో ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తున్న  సయ్యద్ హైమాన్ అనే మూడేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి.

కుక్కలదాడిలో బాలుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం బాలుడిని గోదావరిఖనీ ప్రభుత్వాస్ప త్రికి తరలించారు కుటుంబ సభ్యులు. రామగుండంలో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉందని.. అధికారులు తగిన చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని కోరు తున్నారు.