రైతు వేదికకు తాళం.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఘటన

  • భూమి దానం ఇచ్చినా శిలాఫలకంపై తన తల్లిదండ్రుల పేరు రాయలేదని ఆగ్రహం
  • స్వీపర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నా జీతం కూడా ఇస్తలేరని తాళం వేసిన దాత

కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైతు వేదిక కోసం భూమిని దానంగా ఇస్తే శిలాఫలకంపై తన తల్లిదండ్రుల పేర్లు పెట్టలేదని, అందులో పనిచేసిన తనకు నాలుగేండ్లుగా జీతం కూడా ఇస్తలేరంటూ ఓ వ్యక్తి రైతు వేదికకు తాళం వేశాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా చింతల మానేపల్లి మండలం రుద్రాపూర్‌‌‌‌‌‌‌‌లో రైతు వేదిక నిర్మాణం కోసం అదే గ్రామానికి చెందిన దుర్గం వెంకటి అనే వ్యక్తి 2020లో 10 గుంటల భూమిని దానంగా ఇచ్చాడు.

దీంతో రైతు వేదిక శిలాఫలకంపై వెంకటి తల్లిదండ్రుల పేర్లు రాస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకులు వెంకటికి బాండ్‌‌‌‌‌‌‌‌ రాసిచ్చారు. అప్పటి వెంకటి రైతు వేదికలోనే స్వీపర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. రైతు వేదిక శిలాఫలకంపై అతడి తల్లిదండ్రుల పేర్లు రాయకపోవడం, నాలుగేండ్లుగా అతడికి జీతం ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన వెంకటి ఆదివారం రైతు వేదికకు తాళం వేశాడు. తన జీతం ఇవ్వడంతో పాటు, శిలాఫలకంపై తన తల్లిదండ్రుల పేర్లు రాస్తేనే తాళం తీస్తానని పట్టుబట్టాడు. వెంకటికి గ్రామస్తులు సైతం మద్దతు పలికారు.