సింగరేణి కార్మికుల ఆందోళన.. ఎస్టీపీసీ క్యాంటీన్ మూసివేత

జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లోని క్యాంటీన్‌‌‌‌‌‌‌‌ను ఆఫీసర్లు మూసివేశారు. క్యాంటీన్‌‌‌‌‌‌‌‌లో ఈగలు, పురుగులతో కూడిన బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌‌‌‌‌, కుళ్లిన కూరగాయాలతో పుడ్‌‌‌‌‌‌‌‌ పెడుతున్నారని ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌  సెప్టెంబర్ 22న  అందోళన చేపట్టారు. 

దీంతో స్పందించిన ఆఫీసర్లు క్యాంటీన్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌పై ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్యాంటీన్‌‌‌‌‌‌‌‌ను మూసి వేసినట్లు ఐఎన్టీయూసీ లీడర్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం స్పందించి క్యాంటీన్ నిర్వహణ బాధ్యతను భూ నిర్వాసితులకు అప్పగించాలని కాంట్రాక్ట్ కార్మికులు కోరుతున్నారు.

Also Read:-మాదాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత..