Stock market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..నష్టపోయిన కంపెనీలు ఇవే

ఇండియన్ స్టాక్ మార్కెట్లు గురువారం (నవంబర్ 28) భారీ నష్టాలను చవిచూశాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బెంచ్ మార్క్ BSE సెన్సెక్స్ 1163 పాయింట్ల నష్టపోయి 79వేల 070 వద్ద ట్రేడ్ అయింది. అదేవిధంగా NSC నిఫ్టీ 356 పాయింట్లు నష్టపోయి 23వేల 918 వద్ద ట్రేడ్ అయింది.

30 సెన్సెక్స్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ , టైటాన్ కంపెనీ లిమిటెడ్ ఎక్కువగా నష్టపోయాయి. 

ALSO READ | Adani Group: రూ.1.20 లక్షల కోట్లు పెరిగిన అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్

అత్యధికంగా ఇన్ఫోసిస్ లిమిటెడ్ 3.49శాతం నష్టపోయి 1,857.00 కి చేరుకుంది.మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ 3.18శాతం పడిపోయి రూ. 2,908.85కి చేరుకుంది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2.60శాతం పడిపోయి, రూ. 6,530.00కి చేరుకుంది. HCL టెక్నాలజీస్ లిమిటెడ్ 2.58శాతం పడిపోయి, రూ.1,841.25కి చేరుకుంది. టైటాన్ కంపెనీ లిమిటెడ్ 2.52 శాతం పడిపోయి, రూ.3,208.00కి చేరుకుంది.

నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ నిఫ్టీలో ..

నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఐటీ అత్యధికంగా పడిపోయింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ , నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. 
నిఫ్టీ ఐటీ 2.33 శాతం, నిఫ్టీ ఆటో 1.49 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ , నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ రెండూ 1.11శాతం పడిపోయాయి.