గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కార్పొరేట్ స్థాయి సేవలు

  • వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్...

 నిర్మల్, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటల్స్ లో రోగులకు అన్ని రకాల కార్పొరేట్ స్థాయి సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన  జిల్లా  ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు.

 ఈ సందర్భంగా  హాస్పిటల్ లోని అన్ని వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు.  వారికి అందుతున్న వైద్య సేవలు, సౌక ర్యాలను   అడిగి తెలుసుకున్నారు.  రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  ట్రీట్​మెంట్​ అందించాలన్నారు.  కమిషనర్ వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్,  డాక్టర్ గోపాల్ సింగ్, డీసీ హెచ్ ఎస్ డాక్టర్ సురేశ్​, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజేందర్, డాక్టర్లు పాల్గొన్నారు.