రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలు ప్రారంభం

  • హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఐటీడీఏ పీవో

ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రస్థాయి 5వ గిరిజన క్రీడోత్సవాలు ఆదిలాబాద్  జిల్లా ఉట్నూర్​ కేబీ కాంప్లెక్స్​లో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్​ ఎంపీ గోడం నగేశ్, ఐటీడీఎ పీవో ఖుష్బూ గుప్తా, బోథ్, ఖానాపూర్​ ఎమ్మెల్యేలు అనిల్  జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్  హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ క్రీడలను ఈ నెల 7 వరకు మూడ్రోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు జరిగిన బాలుర రన్నింగ్  పోటీల్లో పరుశురాం(ఉట్నూర్)

గోల్డ్  మెడల్  సాధించగా, మహేశ్(జాతర్ల), సతీశ్(ఏటూరు నాగారం) తర్వాతి స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో లిఖిత (భద్రాచలం) గోల్డ్  మెడల్  సాధించగా..  చిన్నూబాయి, ప్రసన్న సిల్వర్, బ్రాంజ్​ మెడల్స్​ సాధించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీ బాయి, ట్రైబల్  వెల్ఫేర్  డీడీ చందన, డీవైఎస్​వో పార్థసారథి, భుక్యా రమేశ్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.