గవర్నర్ ఓఎస్డీగా సింగరేణి బిడ్డ సంకీర్తన్

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు సిరిశెట్టి సత్యనారాయణ కొడుకు సంకీర్తన్ ఇటీవల రాష్ట్ర గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ కు ఓఎస్డీగా నియమితులయ్యారు. సంకీర్తన్ 2020లో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకొని, ములుగు, మధిర జిల్లాల్లో ట్రైనీ ఐపీఎస్​గా పనిచేశారు. ఆ తరువాత ఏటూరు నాగారం ఏఎస్పీగా విధులు నిర్వహించారు.

ప్రస్తుతం గవర్నర్ ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన తల్లిదండ్రులు,  బెల్లంపల్లి పట్టణ ప్రజలు, సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సంకీర్తన్ తండ్రి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, త‌ల్లి అనిత బెల్లంపల్లిలోని ఓ ప్రైవేటు స్కూల్​ప్రిన్సిపాల్‌గా ఉన్నారు.