అదానీ చేతికి స్టార్​ సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ?

న్యూఢిల్లీ:  అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ అంబుజా సిమెంట్ నార్త్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాలో విస్తరించిన స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. వాల్యుయేషన్ లెక్కలు వేయడానికి కన్సల్టింగ్ కంపెనీ ఈవైని నియమించుకుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కానీ, స్టార్ సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ వార్తలను కొట్టిపారేసింది.  అదానీ గ్రూప్ స్పందించలేదు. చాలా సిమెంట్ కంపెనీలు అస్సాం, నార్త్ ఈస్ట్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టాయి. అల్ట్రాటెక్ 1.2 ఎంటీపీఏ కెపాసిటీ గల గ్రైండింగ్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అస్సాంలో నిర్మిస్తోంది. ఈ ప్లాంట్ 2026–27 లో అందుబాటులోకి వస్తుందని అంచనా. 

జేకే లక్ష్మీ సిమెంట్ కూడా 1 ఎంటీపీఏ  కెపాసిటీ గల క్లింకరింగ్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, 1.5 ఎంటీపీఏ కెపాసిటీ గల సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అస్సాంలో ఏర్పాటు చేయనుంది. స్టార్ సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్ ఇండియాలో బాగా విస్తరించింది. ఈ కంపెనీ కెపాసిటీ 77 లక్ష టన్నులు పెర్ యానమ్ (ఎంటీపీఏ).  మేఘాలయాలో ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, నాలుగు గ్రైండింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది.