-
క్రీడలతో మానసికోల్లాసం
నస్పూర్, వెలుగు: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని శ్రీరాంపూర్ జీఎం సంజీవ రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే5 గని కార్మికులకు నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే తీరిక సమయాల్లో క్రీడల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమన్నారు. సింగరేణి యాజమాన్యం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఓసీపీ పీఓ టి.శ్రీనివాస్, గని మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, డాక్టర్ లోకనాథ్ రెడ్డి, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఉద్యోగులు పాల్గొన్నారు.